జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లను పెంచాలని బీజేపీ చూస్తోంది: రేవంత్ రెడ్డి
జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లను పెంచాలని బీజేపీ చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే మహిళా బిల్లుకు ప్రతి ఒక్కరు మద్దతిస్తారని ఆయన పేర్కొన్నారు. కానీ లోక్ సభ సీట్ల పెంపు విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు.
లోక్ సభ సీట్ల పెంపు విషయంపై అఖిల పక్ష భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లోక్ సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేన్లు వేర్వేరనేది ప్రతి పౌరుడికి తెలుసని అన్నారు. అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే దేశం మొత్తం ఆమోదిస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లు పెంచాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.
దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు ఈ విధానం అన్యాయం చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో దేశాన్ని బలహీనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పార్టీకైనా జాతీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉండాలని అన్నారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం దామాషా పద్ధతి కాకుండా మరో విధానాన్ని అనుసరించాలని కోరారు. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో ఈ అంశంపై ముందుకు వెళ్లాలని సూచించారు.